Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం బీఆర్ఎస్ : హరీశ్ రావు
ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ కు జీవం పోసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ కు జీవం పోసింది కేసీఆర్ అని పేర్కొన్నారు.

Harish Rao
Harish Rao : గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చింది టీఆర్‌ఎస్ పార్టీనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ కు కేసీఆర్ అధికార భిక్ష పెట్టారని తెలిపారు. ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ కు జీవం పోసిందే కేసీఆర్ అని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్ కు జీవం పోసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం బీఆర్ఎస్ అని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని తెలిపారు. కృష్ణ జలాల తరలింపును నిరసిస్తూ గతంలో క్యాబినెట్ నుంచి వైదొలిగారని చెప్పారు. కామన్ మినిమమ్ ప్రొగ్రామ్ లో తెలంగాణ బిల్లు పెడితే యూపీఏ కూటమిలో చేరుతామని చెప్పామని తెలిపారు.
అంతకముందు కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం స్ఫూర్తి అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ కు అవకాశం కల్పించిందే కాంగ్రెస్ అని తెలిపారు. కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పేర్కొన్నారు. అవకాశం ఇస్తే కేసీఆర్ సింగిల్ విండో చైర్మన్ గా ఓడిపోయారని తెలిపారు.
కేసీఆర్ ను కేంద్రంలో షిప్పింగ్ శాఖ, కార్మిక శాఖ మంత్రిని చేసిందే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్ రావుకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. పోతిరెడ్డిపాడుపై గతంలో టి.జనార్ధన్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. జూన్ 2, 2014 నుంచి పదేళ్లపాటు జరిగిన విధ్వంసంపై చర్చించాలని సూచించారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.