Telangana Assembly : కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు విమర్శలు.. పదేళ్లు పాలించి నిందలు మాపై వెయొద్దంటూ భట్టి కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పుడే మాటల దాడి ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలతో కేటీఆర్ విరుచుకుపడ్డారు.

KTR Vs Bhatti Vikramarka
KTR Vs Bhatti Vikramarka : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షం బీఆర్ఎస్ అప్పుడే మాటల దాడి ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడిగా చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకుపడ్డారు. గవర్నర్ ప్రసంగం దారుణంగా ఉందని..ప్రసంగం అంతా అవాస్తవాలేనన్నారు. గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలు,అభూత కల్పనలు,.తప్పుల తడకే అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు, తాగునీటికి దిక్కులేని పరిస్థితులను తెలంగాణ ప్రజలు అనుభవించారు అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అంతా ఆకలి కేకలు తప్ప ఏమీ లేవన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏముంది..? బొంబాయి..బొగ్గు బాయి..దుబాయ్ అంటూ ఎద్దేవా చేశారు.
దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు పాలించి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని.. ప్రభుత్వంపై దాడి చేసే యత్నాలు చెయొద్దు అంటూ సూచించారు. ప్రతిపక్షం ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సూచనలు చేయాలి తప్ప మాటల దాడి చేయొద్దు అంటూ సూచించారు. ఉమ్మడి పాలన గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు…కానీ తెలంగాణను అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనతోనే సలక జనుల సమ్మె వంటివాటితో సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని .. తెలంగాణ వచ్చాక రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేంటీ..? అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తే..బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పాలించి చేసిందేంటీ..? అని ప్రశ్నించారు.