కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ‘పూర్తిగా బేస్‌లెస్ రిపోర్ట్’.. అసలు వాస్తవాలు ఇవే.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో హరీష్ రావు
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్‌లో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు - వాస్తవాలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

Harish Rao PowerPoint Presentation on kaleshwaram commission report
Harish Rao PowerPoint Presentation on kaleshwaram commission report: తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టును సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కమిషన్ రిపోర్టులో పొందుపర్చిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. తాజాగా.. ఆ కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్‌లో ‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు – వాస్తవాలు’పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసలు వాస్తవాలు ఏమిటో ఒక్కో పాయింట్ రూపంలో వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం 60 పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. అయితే, అది పూర్తి రిపోర్టా..? కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా..? ప్రభుత్వం ఏమైనా వండి వార్చిందా..? 655 పేజీల రిపోర్టు బయటపెడితే అసలు వాస్తవం తెలుస్తుంది. ప్రభుత్వం బయటపెట్టిన రిపోర్టు పూర్తిగా బేస్‌లెస్ రిపోర్టు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రాజకీయ కక్ష సాధింపులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. పాలన పూర్తిగా పడకేసింది. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌రాక ఇంట్లోనే ఉంటున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. అవేమీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదు. కమిషన్ల పేరుతో పాలన నడుస్తుంది. రాష్ట్రం మొత్తం కమిషన్ల మయం చేశారంటూ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాయని హరీశ్ రావు అన్నారు.
ఎన్డీఎస్ఏ రిపోర్టు గురించి అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు రెండు సార్లు కూలిపోతే ఎన్డీఎస్ఏ పోలేదు. మేడిగడ్డ బ్యారేజ్ లో రెండు పిల్లర్లు కుంగితే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది అంటూ హరీశ్ రావు అన్నారు. కేసీఆర్, హరీశ్ రావును పిలవాల్సిన అవసరం లేదని, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ.. కాళేశ్వరం కమిషన్ గడువు రాత్రికిరాత్రే పెంచారు. కేసీఆర్ కు, హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చారని మీడియాకే ముందు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రమే అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విసక్ష్ంలో ఎలాంటి రహస్యాలు లేవు. మరి ప్రాజెక్టును కమిషన్ ఎందుకు తప్పుపట్టింది..? కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ప్రభుత్వం చెప్పిన అంశాలు కమిషన్ రిపోర్టులో ఉన్నాయో లేవో తెలియాలి. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ పెడితే ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చీల్చి చెండాడుతుంది. ప్రభుత్వం బయటపెట్టిన రిపోర్టు చూస్తుంటే పూర్తిగా బేస్ లెస్ రిపోర్ట్.. ట్రాష్ లా ఉంది. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే రిపోర్టులు కోర్టు ముందు నిలబడవు, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని హరీశ్ రావు అన్నారు. కేవలం కేసీఆర్ ను హింసించాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యంత లేదనే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని హరీశ్ రావు అన్నారు.
టీవీల్లో వచ్చే సీరియల్ లా రోజుకో అంశంపైన రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి. కన్నేపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ నీళ్లను ఇవ్వడం లేదు. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు పని కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ గ్లోబెల్ ప్రచారం చేస్తుందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టులో కెసిఆర్ సవాల్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరించలేక పారిపోయాడు.
తమ్ముడిహట్టి 152 మీటర్లకు ఎత్తుకు ప్రాజెక్టు కట్టేందుకు అనుమతి ఉన్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని హరీశ్ రావు అన్నారు.
నచ్చని నాయకులను బాధ్యులను చేసినట్టు నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడుతుంది. అదే నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టినట్టు రిపోర్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు టీఏసీ టెక్నికల్ అనుమతులు ఇచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజినీర్లను తప్పుబట్టినట్టు. ఒక వైపూ చూసి ఒక వైపు నిలబడి ఇచ్చినట్టు రిపోర్టు ఉంది. 655 పేజీల రిపోర్టు బయటపెడితే వాస్తవం తెలుస్తుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.