బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు.. ఎందుకంటే?
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.

Kaushik Reddy
BRS MLA Kaushik Reddy : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈనెల7న కరీంనగర్ లో కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పురుషోత్తం, ఆశిష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌశిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Also Read : CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు యాదాద్రి, భద్రాచలం దేవాలయాల సందర్శన.. పూర్తి షెడ్యూల్ ఇలా
ఈనెల 7వ తేదీన కరీంనగర్ లో బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ తోపాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం.. వడ్డీతో సహా ఇచ్చేస్తామంటూ కౌశిక్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవర్నీ వదిలిపెట్టబోము.. ఎవరినైనా జైలుకు పంపిస్తాం అంటూ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో పోలీసుల మనోభావాలను దెబ్బతీశారంటూ పురుషోత్తం, ఆశిష్ గౌడ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Also Read : భారత్ దెబ్బతో మాల్దీవులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా? అందుకే ఇలా..