CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు యాదాద్రి, భద్రాచలం దేవాలయాల సందర్శన.. పూర్తి షెడ్యూల్ ఇలా
ఇవాళ ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సీఎం రేవంత్ యాదగిరిగుట్ట, భద్రాచలం టెంపుల్ సందర్శనతో పాటు భద్రాచలం, మణుగూరులో జరిగే సభల్లో పాల్గొంటారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Bhadrachalam Tour : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండు దేవాలయాలను సందర్శించనున్నారు. తొలుత రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం ఆలయ నిర్వహణ, తదితర అంశాలపై దేవాలయంలో ఆలయ నిర్వాహకులు, అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం యాదగిరి గుట్ట నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా బూర్గంపాడు మండలం సారపాకకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం వెళ్లి శ్రీసీతారామ చంద్ర స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని, స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రెండు ఆలయాలకు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి వెళ్తుండటం గమనార్హం.
Also Read : CM Revanth : యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు.. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి
భద్రాచలంలో రాములోరి దర్శనం అనంతరం మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సాయంత్రం జరిగే ప్రజా దీవెన సభకు సీఎం హాజరవుతారు. తొలిసారి సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.
Also Read : CM Revanth Reddy : ఉచిత విద్యుత్, రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
- సీఎం పర్యటన ఇలా..
ఉదయం 8.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో యాదాద్రికి బయలుదేరుతారు.
ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో యాదాద్రిలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి దర్శనం చేసుకుంటారు.
11గంటలకు యాదగిరి గుట్ట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి బూర్గంపాడు మండలం సారపాకకు సీఎం రేవంత్ రెడ్డి పయనం అవుతారు.
మధ్యాహ్నం 12గంటలకు రేవంత్ రెడ్డి సారపాక హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 12.10 నుంచి 12.50 గంటల వరకు రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం వెళ్తారు.
12.50 గంటలకు శ్రీసీతారామ చంద్ర స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని, అనంతరం ప్రత్యేక పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.10గంటలకు ఆలయం నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకుంటారు.
2గంటల వరకు.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
2 గంటల నుంచి 2.30 గంటల మధ్యలో భోజన విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం 2.45 నుంచి 3.30 గంటల వరకు భద్రాద్రి రామాలయం అభివృద్ధిపై ఆలయ అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు.
మధ్యామ్నం 3.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి మణుగూరుకు వెళ్తారు.
సాయంత్రం 4గంటలకు మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రజాదీవెన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
సాయంత్రం 5గంటలలకు మణుగూరు నుంచి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో తిరుగుపయనం అవుతారు.