Palla Rajeshwar Reddy : పాలనను వదిలేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు- కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే పల్లా ఫైర్

గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. తుంగతుర్తిలో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను ఆయన భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారు.

Palla Rajeshwar Reddy : పాలనను వదిలేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు- కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే పల్లా ఫైర్

Palla Rajeshwar Reddy (Photo : Facebook)

Updated On : January 8, 2024 / 6:54 PM IST

Palla Rajeshwar Reddy : అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మా కుటుంబ సభ్యులపై తీన్మార్ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా భార్య నీలిమ ఇంటర్ లో రాష్ట్ర ప్రధమ స్థానం పొందారని, 1992లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించిందని పల్లా వెల్లడించారు. 2015లో డివిజనల్ ఇంజనీర్ గా ప్రమోషన్ వచ్చిందని తెలిపారు. 6 నెలలు డిప్పుటేషన్ పై సచివాలయంలో పని చేశారని పేర్కొన్నారు. 2020 నవంబర్ 19న వీఆర్ఎస్ తీసుకున్నారని వివరించారు.

Also Read : కేటీఆర్, హరీశ్ రావుపై బండ్ల గణేశ్ సంచలన కామెంట్స్

”వామపక్ష విద్యార్థి సంఘం నాయకురాలిగా ఆమె పని చేసింది. అనురాగ్ విద్యాసంస్థల్లో ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇస్తున్నాం. ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తాము. నాపైన తీన్మార్ మల్లన్న రెండుసార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రజావాణిలో తీన్మార్ మల్లన్నపై ప్రజలు ఫిర్యాదులు చేశారు.

ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా విద్యా సంస్థలకు వచ్చి తీన్మార్ మల్లన్న సోదరుడు బెదిరిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మల్లన్న మాట్లాడుతున్నాడు. జనగామలో నాపైన ఓడిపోయిన అభ్యర్థి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నాడు. మా యూనివర్సిటీకి ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు” అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ప్రజాపాలన మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. శాసన మండలిని ఇరానీ కేఫ్, ఎమ్మెల్సీలను రియల్ ఎస్టేట్ వ్యాపారులని సీఎం అగౌరవపరుస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యేల గన్ మెన్లను తీసివేశారని, సమయం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను ఖాళీ చేయించారని వాపోయారు. అప్పులకుప్ప అంటూ తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని సీరియస్ అయ్యారు.

Also Read : మ‌హిళా ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఆ కార్డు చూపిస్తున్నారా..? అయితే మీరు ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే

రైతుబంధు నిధులు మంత్రుల కంపెనీలకు మళ్ళించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు బాల్క సుమన్. నిధులు ఎటు వెళ్తున్నాయో అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వాయిదా వేయవద్దని కోరారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను తగ్గించారని చెప్పారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15వేలు జీవనభృతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాల్కసుమన్.

”ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత నేతలకు ప్రాణహాని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గన్ మెన్లను తొలగించింది. తుంగతుర్తిలో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను ఆయన భార్యను కాంగ్రెస్ వాళ్లు కొట్టారు. కొల్లాపూర్ లో బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది” అని బాల్క సుమన్ ఆరోపణలు చేశారు.