MLA Pilot Rohith reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓవరాక్షన్ .. ప్రభుత్వ సెక్యురిటీ సిబ్బందితో రీల్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

brs mla pilot rohit reddy
BRS MLA Pilot Rohith reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మెుయినాబాద్ ఫాంహౌస్ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విమర్శలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓవరాక్షన్ తో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేల వివాదంతో ఆయనకు భద్రత పెంచింది ప్రభుత్వం. ఏకంగా ఆ భద్రతా సిబ్బందితోనే చేసిన రీల్స్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోహిత్ రెడ్డికి ఇరువైపులా పోలీసులు, గన్ మెన్లు నడిచి వస్తుంటే ఆయన రాజసంగా మధ్యలో నడుస్తు వస్తున్నట్లుగా షూట్ చేసారు. ప్రభుత్వ కల్పించిన సెక్యురిటీ సిబ్బందితో ఇలా రీల్స్ చేయటంపై విమర్శలు వస్తున్నాయి.
Telangana Congress: కాకరేపిన ‘కరెంట్’ కామెంట్లు.. రేవంత్‌రెడ్డిపై రగులుతున్న సీనియర్లు
వికారాబాద్ లో రోహిత్ రెడ్డి యాగం నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన పట్టు వస్త్రాలు ధరించి ఇరువైపులా సెక్యురిటీ సిబ్బంది గన్ లతో నడిచి వస్తుండగా వారి మధ్యలో ఎమ్మెల్యే ఠీవీగా నడిచి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ప్రభుత్వ సిబ్బందితో ఇలా షూట్ లు చేస్తారా..? ఇదే ప్రజా ప్రతినిధులు చేసే పని అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
వికారాబాద్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కొన్నిరోజులుగా యాగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీతో రీల్స్ చేసిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ప్రభుత్వ సెక్యురిటీతో ఇలా చేయటం తగదని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం సమయంలో రోహిత్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేయగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. అదే భద్రతా సిబ్బందితో ఇలా రీల్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. మరి ఈ విమర్శలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
YS Sharmila: ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడు కన్నా పొడువే: షర్మిల