Health Cards For Employees: ఉద్యోగులకు హెల్త్ కార్డులు.. త్వరలో విధివిధానాలు ఖరారు- డిప్యూటీ సీఎం భట్టి

పెండింగ్ బిల్లులను నెలకు 700-750 కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామన్నారు. నర్సింగ్ డైరెక్టరేట్ ని కూడా త్వరలో ఏరాటు చేస్తామన్నారు.

Health Cards For Employees: ఉద్యోగులకు హెల్త్ కార్డులు.. త్వరలో విధివిధానాలు ఖరారు- డిప్యూటీ సీఎం భట్టి

Updated On : September 2, 2025 / 6:00 PM IST

Health Cards For Employees: ఉద్యోగులకు హెల్త్ కార్డులు అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోకస్ పెట్టారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. దీనికి సంబంధించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో రాష్ట్ర కాబినెట్ సబ్ కమిటీతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, ఇతర అధికారులు సమావేవంలో పాల్గొన్నారు. ఈ నెల 8న ప్రధాన కార్యదర్శితో జేఏసీ అధికారుల కమిటీ సమావేశం కానుంది. హెల్త్ కార్డులపై విధివిధానాలు చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

పెండింగ్ బిల్లులను నెలకు 700-750 కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామన్నారు. నర్సింగ్ డైరెక్టరేట్ ని కూడా త్వరలో ఏరాటు చేస్తామన్నారు. విజిలెన్స్, ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, 2 సంవత్సరాలకు పైగా సస్పెన్షన్ లో ఉన్న వారికి క్రమంగా పోస్టింగ్స్ ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read: కవిత కొత్త పార్టీ ఇదేనా? నెక్ట్స్ ప్లాన్ ఏంటి?