BRS MLAs : కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. తాము గెలిచినా తమ పార్టీ ఓడిపోవటంతో నిరాశలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో వారు పార్టీ మార్పులో వివరించారు.

BRS MLAs : కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

BRS MLAs

BRS MLAs party change : ఎమ్మెల్యేగా గెలవాలనే ఆకాంక్ష నెరవేరింది. కానీ తాను పోటీ చేసిన పార్టీ ఓడిపోయింది. ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితి చాలామంది ప్రజాప్రతినిధులకు ఎదురవుతుంటుంది. తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి అలాగే ఉంది.  బీఆర్ఎస్ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ఆ పార్టీ అభ్యర్థులు తాము గెలిచినందుకు సంతోషించాలో, తమ పార్టీ ఓడిపోయినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

సరిగ్గా అటువంటి పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారిపోతున్నారని.. పార్టీ ఫిరాంపునకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని, దాని కోసం రేవంత్ రెడ్డిని కలిసారనే ఊహాగానాలు వచ్చాయి. దీంతో కౌశిక్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారటలేదని.. పాత ఫోటో పెట్టి తాను రేవంత్ రెడ్డిని కలిసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం నిజం కాదని స్పష్టం చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోనే ఉంటానని.. కేసీఆర్, ఆయన కుటుంబంతో ఉంటానని వెల్లడిచారు. ఫేక్ వీడియోలు, ఫోటోలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందిన విషయం తెలిసిందే.

Also Read: సిట్టింగ్ సీఎంని.. కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీదే : కిషన్ రెడ్డి

సరిగ్గా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై. దీంతో 10టీవీకి తెల్లం క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్తున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారని.. తాను పార్టీ మారేది లేదని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని తెలిపారు. కాగా..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మళ్లీ ఒకే ఒక స్థానం భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు కావటం గమనించాల్సిన విషయం.

Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 52 మంది గెలుపు

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 52 మంది కొత్తగా గెలిచారు. రాష్ట్రంలోని 119 మంది అమ్మెల్యేల్లో కొత్తగా 52 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 34 మంది కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బీఆర్ఎస్ నుంచి 9 మంది ఉండగా వీరిలో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.