Kishan Reddy : సిట్టింగ్ సీఎంని.. కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీదే : కిషన్ రెడ్డి
కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని..బీజేపీ అభ్యర్తి వెంకట రమణారెడ్డి ఓడించారని అది బీజేపీ ఘనత అని అన్నారు కిషన్ రెడ్డి. ఇటువంటి విజయాన్ని అందుకున్న వెంకట రమణారెడ్డిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.

kishan reddy
kishan reddy..KCR and Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతం కంటే ఓట్ల శాతాన్ని పెంచుకుందని ఇది శుభపరిణామం అని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆశించినట్లుగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా మూడు రాష్ట్రాల్లో ఘన విజయాన్ని సాధించామన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడతామని తెలిపారు. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో బీజేపీ ఘన విజయం సాధించిందని..ఇక పార్లమెంట్ ఎన్నిలపై దృష్టిపెడతామని దీని కోసం పక్కా ప్రణాలతో ముందుకెళతామని తెలిపారు. మరోసారి ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీకి అధికారంలోకి వస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో సిట్టింగ్ సీఎంను..కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీదే’’ అని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని..బీజేపీ అభ్యర్తి వెంకట రమణారెడ్డి ఓడించారని అది బీజేపీ ఘనత అని అన్నారు. ఇటువంటి విజయాన్ని అందుకున్న వెంకట రమణారెడ్డిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.
Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా 52 మంది గెలుపు
ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు 2018 ఎన్నికల ఫలితాల పోలిస్తే తమకు 100 శాతం ఓటింగ్ షేరింగ్ పెరిగిందని తెలిపారు.గతంలో 1 స్థానం గేలిస్తే ఇప్పుడు 8 గెలిచామన్నారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాటం చేసామని..కానీ తమకు అనుకున్న ఫలితాలు రాలేదని కానీ వీటిపై నిరాశ చెందకుండా సమీక్ష చేసుకుంటామన్నారు.సమీక్ష చేసుకొని పార్లమెంట్ ఎన్నికల కోసం మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు.కార్యకర్తలు ఏమాత్రం నిరుత్సాహం చెందవద్దని ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమేనని అన్నారు.
కాంగ్రెస్ , బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు పంచి గెలవాలనుకున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వన్ సైడ్ విజయం రాలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా మూడు రాష్ట్రలలో అధికారంలోకి వచ్చామన్నారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో తాము గెలిచామని ..మధ్యప్రదేశ్ లో గతంలో కన్నా భారీ మెజార్టీ ని సాధించామని తెలిపారు.రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని పోగొట్టుకుని తెలంగాణలో మాత్రమే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బొటబొటి మెజారిటీ తోనే గెలించిదన్నారు. కామారెడ్డి లో ముఖ్యమంత్రి, ని కాబోయే ముఖ్యమంత్రి ని ఓడిచిన చరిత్ర బీజేపీది..దేశ చరిత్రలో ఇలాంటి ఎక్కడ జరగలేదన్నారు. ఇద్దరి ఓడించిన జాయింట్ కిల్లర్ కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
దేశంలో మూడోసారి విజయం విజయం సాధిస్తామని..హ్యాట్రిక్ కొత్త బోతున్నామని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ తెలంగాణలో ఐదేళ్లుగా ప్రజల తరపున పోరాటం చేస్తున్నామని ..కానీ విజయం మాత్రం కాంగ్రెస్ కు దక్కిందన్నారు. ఐనా బీజేపీ ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రణాళిక తయారు చేసుకుంటామని..అసెంబ్లీ వారీగా సమీక్ష చేసుకుని ముందుకెళతామన్నారు. తెలంగాణలో ఓటమి మాకు ఒక సవాలుగా భావిస్తామని ఇనుమడించిన ఉత్సాహంతో పనిచేసి..వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలు కాబ్టి ప్రతీ ఒక్కరి సేవలు వినియోగించుకుంటామన్నారు.
కాగా..ఈరోజు కిషన్ రెడ్డి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి వెళ్లారు. అక్కడ కిషన్ రెడ్డికి రాజాసింగ్..బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్ ను కిషన్ రెడ్డి అభినందించారు. కాగా..వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జైలుకు వెళ్లి బయటకు వచ్చిన రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తరువాత సస్పెన్షన్ ను తీసివేసింది. యథాతథంగా గోషామహల్ టికెట్ ను రాజాసింగ్ కే కేటాయించింది. అలా తనపై ఎన్ని వివాదాలు వచ్చినా తన గెలుపును మాత్రం నిలుపుకున్న రాజాసింగ్ ను కిషన్ రెడ్డి అభినందించారు.