MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్.. తాజా కీలక అంశాలివే..!
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

MLC Kavitha Filed Writ petition in Supreme Court
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆమె రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజా రిట్ పిటిషన్‌లో కీలక అంశాలు ఇలా ఉన్నాయి. ‘నా అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించారు. చట్ట పరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారు. నా అరెస్టు చట్టబద్ధం కాదు. ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు.
పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం.. మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించారు. ఈడీ రిమాండ్ రద్దు చేయాలి. ఈడి కస్టడీ నుంచి విడుదల చేయాలి’ అని పిటిషన్‌లో కవిత విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే, కవిత ఈడీ కస్టోడియల్ ఇంటరాగేషన్ మూడో రోజు ముగిసింది. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈడీ విచారించింది. మనీలాండరింగ్ కేసులో కవిత పాత్ర ఏంటి? 100 కోట్ల ముడుపులు, సిసోడియా-కేజ్రీవాల్ ఒప్పందాలు సహా నిందితుల వాంగ్మూలాలపై ఈడీ ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. తల్లితో పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తన పిల్లలను కూడా కలిసేందుకు అవకాశం కల్పించాలని కవిత తరపు న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు.. తల్లి, కుమారులను కలిసేందుకు కవితకు అనుమతినిచ్చింది.