Dasoju Sravan Kumar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Dasoju Sravan Kumar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

BRS Party gives second chance to Dasoju Sravan Kumar as mlc candidate

Updated On : March 9, 2025 / 9:54 PM IST

Dasoju Sravan Kumar : తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠంగా మారాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గురించి పెద్ద చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (మార్చి 10)న ఉదయం దాసోజు శ్రవణ్‌ నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్‌ ప్రక్రియను దగ్గరనుంచి పర్యవేక్షించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఆదేశించినట్టు సమాచారం.

పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆయన పేరును పరిశీలనలోకి తీసుకున్నారు. మార్చి 10న (సోమవారం) ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేశారు.

ముందు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీసీ కోటాలో జోగు రామన్న, బూడిద బిక్షమయ్య గౌడ్ రేసులో ఉన్నారు. అయితే, దాసోజు శ్రవణ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. గతంలో గవర్నర్ కోటలో అవకాశం ఇచ్చినా రాజకీయ కారణాలతో ఆయనకు పదవి దక్కలేదు. బీసీ కోణంలోనూ ఆలోచించి దాసోజు‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ నెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా 3 కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్‌ఎస్‌కు రానున్నాయి.

Read Also : MLC Candidates: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌.. క్యాండెట్స్‌ వీరే..