కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు.. స్వాగతించిన మల్లికార్జున ఖర్గే

సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు.. స్వాగతించిన మల్లికార్జున ఖర్గే

BRS MP Keshava Rao joins Congress Party in Delhi

Keshava Rao joins Congress: సీనియర్ నాయకుడు, బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనను మల్లికార్జున ఖర్గే సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీనియర్ నేత వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, బీఆర్ఎస్ పార్టీని వీడిని కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు మార్చి 29న కేశవరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో సెక్రటరీ జనరల్ పదవితో పాటు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఉన్నారు.

మంత్రివర్గ విస్తరణపై ఖర్గే నివాసంలో కీలక భేటీ
తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

తాను పీసీసీ అధ్యక్ష ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ 10 టీవీతో చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఆయన తలిపారు. కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

Also Read : క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ ఫోకస్.. ఆ నలుగురికి ఛాన్స్..! కేటాయించే శాఖలపై ఉత్కంఠ