Building Collapses: హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవన శ్లాబ్ కూలి ఒకరి మృతి.. మరికొందరికి గాయాలు

హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవన నాలుగో అంతస్తు శ్లాబ్ కుప్పకూలి ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని బీజేపీ ఆఫీసుకి సమీపంలోని నాలుగు అంతస్తుల భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో నాలుగో అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Building Collapses: హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవన శ్లాబ్ కూలి ఒకరి మృతి.. మరికొందరికి గాయాలు

Building Collapses

Updated On : January 7, 2023 / 5:52 PM IST

Building Collapses: హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవన శ్లాబ్ కుప్పకూలి ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇద్దరు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని బీజేపీ ఆఫీసుకి సమీపంలోని నాలుగు అంతస్తుల భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో నాలుగో అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

దీంతో గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయని తెలుస్తోంది. భవన నిర్మాణ పనులు జరుగుతుండగా ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సరైన విధంగా నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో నాలుగో అంతస్తు శ్లాబ్ కుప్పకూలినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ వారికి భవనం వద్దే ప్రాథమిక చికిత్స అందించారు. నిర్మాణంలో ఉన్న ఆ అపార్ట్ మెంట్ పక్కనే మరికొన్ని అపార్ట్ మెంట్లు ఉన్నాయి. గాయపడ్డ వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. నాలుగో అంతస్తు శ్లాబ్ కూలడంతో దానికి దగ్గరగా ఉన్న విద్యుత్ వైర్లూ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. శిథిలాల కింద ఇద్దరు ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Rohit Shetty : హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ గాయపడ్డ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్