Mlc Kavitha : ఇంటి భోజనం, దుస్తులు, పరుపు.. సీబీఐ కస్టడీలో కవితకు కొన్ని వెసులుబాట్లు

కుటుంబసభ్యులు కలిసే సమయంలో సీబీఐ అధికారులు ఉండొద్దని ఆదేశించింది కోర్టు.

Mlc Kavitha : ఇంటి భోజనం, దుస్తులు, పరుపు.. సీబీఐ కస్టడీలో కవితకు కొన్ని వెసులుబాట్లు

Mlc Kavitha

Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీలో ఉన్నారు. సోమవారం ఉదయం 10 గంటల వరకు ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. కాగా, కస్టడీలో కవితకు రౌస్ అవెన్యూ కోర్టు వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంసభ్యులు, న్యాయవాదిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది. లాయర్ మోహిత్ రావు, ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ తో పాటు పీఏకు అనుమతి ఇచ్చింది కోర్టు.

కుటుంబసభ్యులు కలిసే సమయంలో సీబీఐ అధికారులు ఉండొద్దని ఆదేశించింది కోర్టు. కవితకు ఇంటి భోజనం ఇచ్చేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. జపమాల, దుస్తులు, పరుపు, బెడ్ షీట్లు, టవల్స్, పిల్లో ఇవ్వాలని పేర్కొంది. కవిత చదువుకునేందుకు 5 పుస్తకాలను అనుమతించింది కోర్టు.

సీబీఐ కస్టడీలో కవితకు కొన్ని వెసులుబాట్లు..
* ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు
* ప్రతిరోజూ సాయంత్రం 6-7 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి
* కవితను కలిసే వారిలో న్యాయవాది మోహిత్ రావు, భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీ రామారావు (కేటీఆర్), పీఏ శరత్‌చంద్ర
* వారితో పాటు ఇంటి భోజనం తీసుకొచ్చేందుకు విద్యానిధి పరాంకుశంకు కూడా అనుమతి
* న్యాయవాది, కుటుంబసభ్యులు కలిసే సమయంలో సీబీఐ అధికారులు వినడానికి వీలు లేకుండా కోర్టు ఆదేశాలు
* సీబీఐ కస్టడీలో ఉన్న కవితకు ఇంటి భోజనానికి అనుమతి
* జపమాల, దుస్తులు, పరుపు, బెడ్‌షీట్లు, టవల్స్, పిల్లోను కూడా అనుమతించిన కోర్టు
* కవిత చదువుకోడానికి 5 పుస్తకాలు అనుమతించిన కోర్టు

కవితకు అనుమతించిన పుస్తకాల పేర్లు:
* ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్
* ఎలాన్ మస్క్
* ది నట్‌మెగ్స్ కర్స్
* రెబెలా ఎగెనెస్ట్ ది రాజ్
* రోమన్ స్టోరీస్

Also Read : 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్