Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌..మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను 7 రోజు కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. ఆ విచారణ నేడు జరగనుంది.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌..మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు

Telugu Academy

Updated On : October 5, 2021 / 1:41 PM IST

CCS police investigating former director : తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను 7 రోజు కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. ఆ విచారణ నేడు జరగనుంది. మరోవైపు ఇప్పటికే విచారిస్తున్న వారిలో కొందరిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రెండు రోజులుగా మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని కూడా విచారిస్తున్నారు. ఆయనతో పాటు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అధికారులను సైతం ఎంక్వైరీ చేస్తున్నారు. కొన్ని డిపాజిట్లుకు సంబంధించి సోమిరెడ్డి రిలీజింగ్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకులకు ఇచ్చిన రిలీజింగ్ ఆర్డర్‌పై ఆరా తీస్తున్నారు సీసీఎస్ పోలీసులు.

మరోవైపు ఏపీ మర్కంటైల్ బ్రాంచ్‌ నుంచి డ్రా చేసిన డబ్బులు ఎక్కడికెళ్లాయన్న దానిపై విచారణ చేస్తున్నారు. అలాగే 64 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో తెలియడం లేదంటున్నారు. అరెస్ట్ అయిన వారి ఖాతాలో చిల్లిగవ్వ కూడా లేదన్నారు. 64 కోట్ల నిధులు ఆచూకీ తెలుసుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సత్యనారాయణను కూడా విచారిస్తామంటున్నారు సీసీఎస్ పోలీసులు.

Telugu Academy : తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు

63 కోట్ల రూపాయల డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి అక్కడి నుంచి విడతల వారీగా నగదు విత్ డ్రా చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు కూడా నగదును తీసుకున్నారు. ఏపీ మర్కంటైల్ సొసైటీ క్లర్క్‌ మొహిద్దీన్ నగదును నిందితులకు అందజేశారు. నగదు తీసుకున్నది ఎవరనే? కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి సహాయకుడిగా వ్యవహరించిన రాజ్ కుమార్… ఈ తతంగంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఏజెంట్లు కలిసి నకిలీ డిపాజిట్ పత్రాలు, లేఖలు సృష్టించి మోసానికి తెరలేపినట్లు అనుమానాలున్నాయ్‌. ఈ కేసులో ఇప్పటికే మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కస్టడీకి అనుమతిస్తే… నలుగురు నిందితులను ప్రశ్నించడం ద్వారా మరికొంత సమచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు సీసీఎస్ పోలీసులు.