Telugu Academy : తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు

తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు పడింది. ప్రభుత్వం ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్‌గా దేవసేనను నియమించింది. తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఎంక్వైరీ కొనసాగుతోంది.

Telugu Academy : తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు

Telugu Academy

Telugu Academy Director suspend : తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు పడింది. ప్రభుత్వం ఆయన స్థానంలో తాత్కాలిక డైరెక్టర్‌గా దేవసేనను నియమించింది. స్కామ్‌పై విచారణ జరుగుతుండగా సోమిరెడ్డి డైరెక్టర్‌గా కొనసాగితే.. రాంగ్‌ మెస్సేజ్‌ వెళుతుందని అభిప్రాయపడ్డ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు.. తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఎంక్వైరీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా.. తాజాగా సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురుపై రిమాండ్ రిపోర్టులో అభియోగాలు మోపారు పోలీసులు.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో మరొకరు అరెస్టు

వారిలో ముగ్గురిని 14 రోజులు రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. తాజాగా మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా.. యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్‌, ఏ2గా.. రాజ్‌ కుమార్‌, ఏ3గా బండారు వీరవెంకట రంగాను చేర్చిన పోలీసులు.. వారు పరారీలో ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి, ఏపీ మర్కంటైల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్ మేనేజర్ పద్మావతి, ఏపీ మర్కంటైల్‌ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన మొయినుద్దీన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఈ కేసులో విచారణ చురుగ్గా సాగుతోంది. ఇంకా మరికొందరిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ ఉద్యోగులను అధికారులు సైతం ప్రశ్నిస్తున్నారు.