ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ కు స్థలం కేటాయించిన కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : October 9, 2020 / 09:15 PM IST
ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ కు స్థలం కేటాయించిన కేంద్రం

Updated On : October 9, 2020 / 10:11 PM IST

TRS Party office in delhi ఢిల్లీలోతెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) పార్టీ ఆఫీస్ నిర్మాణ కోసం కేంద్రప్రభుత్వం స్థలం కేటాయించింది. ఢిల్లీ వసంత విహార్‌లో 1100 చ.మీ స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌజింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిప్యూటీ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ దీన్‌దయాల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు శుక్రవారం లేఖ రాశారు.



దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. ఢిల్లీలో స్థలం కేటాయింపు ప్రక్రియ ముగిసినందున త్వరలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసి త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.