CV Anand: ట్విటర్‌లో వ్యాయామ వీడియోను షేర్ చేసిన సీపీ సీవీ ఆనంద్.. పీవీ సింధూ, మాజీ క్రికెటర్ లక్ష్మణ్‌తో సహా …

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్విటర్ ఖాతాలో తన వ్యాయామ వీడియోను షేర్ చేశారు. ఆ ట్వీట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వీ.వీ.లక్ష్మణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూతో పాటు పలువురి టాలీవుడ్ హీరోలను ట్యాగ్ చేశారు.

CV Anand: ట్విటర్‌లో వ్యాయామ వీడియోను షేర్ చేసిన సీపీ సీవీ ఆనంద్.. పీవీ సింధూ, మాజీ క్రికెటర్ లక్ష్మణ్‌తో సహా …

CP CV Anand

Updated On : June 24, 2023 / 12:34 PM IST

CV Anand Workout Video: జూన్ 23న ఒలింపిక్ డేను పురస్కరించుకొని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. తాను వ్యాయామం చేస్తున్న దృశ్యాలతో నిమిషం నిడివి కలిగిన వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో సీవీ ఆనంద్ ఇలా రాశారు.. నేడు మన జీవితాల్లోని ఆందోళనకరమైన ట్రెండ్‌ని ఒకసారి ఆలోచిద్దాం. మనుపెన్నడూ లేనంత వేగంగా కదులుతున్న ప్రపంచంలో.. ప్రజలు తక్కువగా కదులుతున్నట్లు చూడటం కలవరపెడుతుంది. చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. పిల్లలు, యువకులు తమ సెల్ ఫోన్‌లు, డిజిటల్ గాడ్జెట్‌లకు అతుక్కుపోతున్నారు. శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీవీ ఆనంద్ అన్నారు.

Mamata Banerjee Workout: ట్రెడ్ మిల్‌పై కుక్కపిల్లతో మమతా బెనర్జీ వర్కౌట్లు.. అదనపు ప్రేరణ కావాలంటూ ట్వీట్..

శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ధోరణిని తిప్పికొట్టడానికి ఇది సమయం. చురుకైన జీవనశైలికి ప్రాధాన్యతనివ్వండి అని సీవీ ఆనంద్ సూచించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. దయచేసి మీ వ్యాయామ వీడియోలను పోస్టు చేయండి, వాటిని చూడటానికి ఇష్టపడతాను అని పేర్కొన్నారు.

 

 

సీవీ ఆనంద్ ట్విటర్ ఖాతాలో తన వర్కౌట్ వీడియోను షేర్ చేసి.. ఆ ట్వీట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వీ.వీ.లక్ష్మణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, సినీహీరోలు అడవి శేషు, నిఖిల్‌లను ట్యాగ్ చేశారు. మీ వర్కౌంట్ వీడియోలను షేర్ చేయండి. ఎందుకంటే, అవి శారీరక శ్రమ చేయడానికి ప్రతిఒక్కరిని ప్రేరేపిస్తాయి అని సీవీ ఆనంద్ కోరారు.