వాళ్లందరికీ గుడ్ బై.. సీఎం చంద్రబాబు సంచలనం.. 2029 ఎన్నికలే టార్గెట్..
ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా..? తగ్గుతుందా..? అనేది పరిశీలిస్తున్నా. 4.1 పూర్తైంది. రెండో ఏడాది ప్రారంభమైంది. ఓ నెలకూడా అయిపోయింది. మీటర్ స్టార్ట్ అయింది.

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదేసమయంలో కొందరు నేతలకు స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చారు.
Also Read: రాజకీయ ముసుగులోఉన్న నేరస్థులను ఏరి వేయాలి.. సత్తెనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్
2029 ఎన్నికలే నా టార్గెట్. పనితీరు బాగాలేని వారికి నిర్మొహమాటంగా గుడ్‌బై చెప్పేస్తా అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు, పనిచేసేందుకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. సంవత్సరాలను, నెలలను, రోజులను, గంటలను కూడా లెక్కిస్తున్నా. తానా, ఆటాలు అంటూ ఫారెన్ ట్రిప్పులు వద్దు. తానా, ఆటా అంటూ వెళ్తే టాటాలు చెప్పేస్తా అంటూ చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.
ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా..? తగ్గుతుందా..? అనేది పరిశీలిస్తున్నా. 4.1 పూర్తైంది. రెండో ఏడాది ప్రారంభమైంది. ఓ నెలకూడా అయిపోయింది. మీటర్ స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని గమనించి ప్రజల్లో ఉండేలా పనిచేయాలి. వచ్చే నెలరోజులు ప్రజల్లో ఉంటూ ప్రతి ఇంటి గడపను తొక్కాలి. కష్టాల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలంటూ చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు సూచించారు.