No Lock Down : తెలంగాణలో లాక్ డౌన్ లేదు

తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.

No Lock Down : తెలంగాణలో లాక్ డౌన్ లేదు

No Lock Down

Updated On : May 7, 2021 / 6:35 AM IST

CM KCR : తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు.

ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టినా ప్రయోజనం ఉండటం లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రోగులు హైదరాబాద్ కు వస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ పై భారం పెరిగిపోయిందన్నారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఆక్సిజన్ సరఫరాను 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని మోడీని కోరారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, రెమి డెసివర్ అందించాలని ప్రధానిని కోరారు.