CM KCR : మహిళ పేరు మీదనే పోడు భూములకు పట్టాలు.. ఆ భూములపై ఉన్న కేసులు రద్దు : సీఎం కేసీఆర్

అడవి బిడ్డలు ఎన్నాళ్లగానో వేచి చూసిన శుభతరుణం రానే వచ్చింది. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు.

CM KCR : మహిళ పేరు మీదనే పోడు భూములకు పట్టాలు.. ఆ  భూములపై ఉన్న కేసులు రద్దు : సీఎం కేసీఆర్

CM KCR Podu lands

Updated On : June 30, 2023 / 5:42 PM IST

CM KCR distributed Podu Patta lands : అడవి బిడ్డలు ఎన్నాళ్లగానో వేచి చూసిన శుభతరుణం రానే వచ్చింది. పోడు భూములకు సీఎం కేసీఆర్ పట్టాలు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నామని మహిళల పేరుమీదుగానే ఈ పట్టాలను ఇస్తున్నామని తెలిపారు.

పోడు భూములపై ఉన్న కేసులను రద్దు చేస్తున్నామని ప్రకటించారు.  అంతేకాదు పోడు భూములకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. దీని కోసం ఈ సందర్భంగా రూ.23కోట్ల 59 లక్షల 90వేలను చెక్కులు విడుదల చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని..ప్రతీఇంటికి నీరు అందిస్తున్నామని తాగునీటి కష్టాలు తీర్చామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,06,369 ఎకరాల పోడు భూములకు పట్టా హక్కులు ఇవ్వనుంది ప్రభుత్వం. దీంట్లో లక్షా 51 వేల 146 మంది గిరిజనులకు ఈరోజు పోడు పట్టాలు పంపిణీ చేసింది. ఈ పంపణీ కార్యక్రమాలు ఆయా ప్రదేశాల్లో మంత్రులు పంపిణీ చేశారు. దీంట్లో భాగంగానే ఆసిఫాబాద్ లో సీఎం కేసీఆర్ చేతులు మీదు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో మంత్రి హరీశ్ రావు. పువ్వాడ పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబా బాద్ లో మంత్రి కేటీఆర్, సత్యవతి రాథోఢ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. పాలమూరు జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్,నిరంజన్ రెడ్డి ఇలా ఆయా జిల్లాల్లో మంత్రులు గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు.

Also Read: ప్రధానికి మంత్రి కేటీఆర్ 10 ప్రశ్నలు.. సమాధానం చెప్పాకే మోదీ వరంగల్ లో అడుగుపెట్టాలి