Kusukuntla Prabhakar Reddy : మునుగోడు ఉప ఎన్నిక‌ టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి.. బీ ఫామ్‌ అంద‌జేసిన సీఎం కేసీఆర్

మునుగోడు ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాక‌ర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్‌ అంద‌జేశారు.

Kusukuntla Prabhakar Reddy : మునుగోడు ఉప ఎన్నిక‌ టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి.. బీ ఫామ్‌ అంద‌జేసిన సీఎం కేసీఆర్

Kusukuntla Prabhakar Reddy

Updated On : October 7, 2022 / 7:28 PM IST

Kusukuntla Prabhakar Reddy : మునుగోడు ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాక‌ర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బీ ఫామ్‌ అంద‌జేశారు.

అలాగే ఎన్నిక‌ల ఖ‌ర్చుల కోసం పార్టీ ఫండ్ నుంచి రూ. 40 ల‌క్ష‌ల చెక్కును ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ అంద‌జేశారు.  మునుగోడు అభ్య‌ర్థిగా త‌న‌కు అవ‌కాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ప్ర‌భాక‌ర్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Bypoll in Munugodu : మునుగోడు బైపోల్‌ హడావుడి.. ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్ ?

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, ఎమ్మెల్సీలు త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.