Telangana Election : 2023 టార్గెట్.. టీఆర్ఎస్ కోసం పీకే టీమ్ పని చేస్తోందా ?
రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు.. ప్రశాంత్ కిశోర్ టీం సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Kcr
Prashant Kishor Team Telangana : 2023 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు.. ఇప్పటి నుంచే స్కెచ్ రెడీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. గెలుపే లక్ష్యంగా.. సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్లేందుకు కసరత్తు మొదలుపెట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు.. ప్రశాంత్ కిశోర్ టీం సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐప్యాక్ ప్రతినిధులతో కేసీఆర్ సమావేశమయ్యారని.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read More : Paddy Purchases : ఏపీలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్ళు
ఈ మధ్యకాలంలో.. ఐ ప్యాక్ సర్వే టీమ్.. టీఆర్ఎస్ పెద్దలతో పలుమార్లు భేటీ అయినట్లు సమాచారం. తాజా సమావేశంలో.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే.. తెలంగాణ మూడ్ తెలుసుకునేందుకు కేసీఆర్ కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలపై.. ప్రజలేమనుకుంటున్నారన్నది.. సర్వేల ద్వారా సేకరించడంపై చర్చించినట్లు చెబుతున్నారు. 2023 ఎన్నికల కంటే ముందు.. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించుకొని.. మరోసారి జనానికి చేరువయ్యేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
Read More : Akhanda : దేశ విదేశాల్లో బాలయ్య క్రేజ్.. ఖండాంతరాలు దాటిన ‘అఖండం’
ఐ ప్యాక్ నుంచి ప్రస్తుతానికి.. సర్వేలకు సంబంధించిన సేవలు మాత్రమే తీసుకోవాలని.. భవిష్యత్తులో అవసరమైతే మరింత సాయం పొందే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే.. పీకే టీం సర్వేలకే పరిమితమవుతుందా? వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది.