రేపు సీఎం కేసీఆర్ సభ …ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలు బంద్

  • Published By: bheemraj ,Published On : November 27, 2020 / 08:41 PM IST
రేపు సీఎం కేసీఆర్ సభ …ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలు బంద్

Updated On : November 27, 2020 / 9:10 PM IST

LB Stadium Traffic restrictions : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేపు సీఎం కేసీఆర్ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అనుమతి నిరాకరించారు.



సికింద్రాబాద్ నుంచి సభకు వచ్చే వాళ్లు పబ్లిక్ గార్డెన్, రవీంద్ర భారతి, డాక్టర్ కార్స్ ప్రాంతాల్లో తమ కార్లను పార్క్ చేయాలని సూచించారు. ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ నుంచి వచ్చే వాహనాలకు పీపుల్స్ ప్లాజా వద్ద పార్కింగ్ చేయాలని చెప్పారు.



ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీలో నిలపాలని తెలిపారు. మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్ లో పార్కింగ్ చేయాలని పేర్కొన్నారు.



సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే వాళ్లు భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్క్ ధరించాలి..శానిటైజర్ తప్పనిసరి అని తెలిపారు.