Huzurabad Bypoll : ఎంపీటీసీ భర్తకు సీఎం కేసీఆర్ ఫోన్, ఏం చెప్పారంటే

హుజూరాబాద్‌ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెంచారు. దళిత సాధికారత కోసం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘దళితబంధు’పై ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్‌ ఫోన్‌ చేశారు.

Huzurabad Bypoll : ఎంపీటీసీ భర్తకు సీఎం కేసీఆర్ ఫోన్, ఏం చెప్పారంటే

Ramaswamy

Updated On : July 24, 2021 / 4:41 PM IST

CM KCR Phone : హుజూరాబాద్‌ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెంచారు. దళిత సాధికారత కోసం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న ‘దళితబంధు’పై ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. దళితబంధు పథకం గురించి ఫోన్‌లో ప్రస్తావించారు తెలంగాణ సీఎం.

Read More : YouTube Android : ప్రపంచ జనాభాను దాటేసిన ఆండ్రాయిడ్‌ యూట్యూబ్ డౌన్‌లోడ్స్..!

ప్రపంచంలోనే అతిపెద్ద పథకం దళిత బంధు అని.. ఈ పథకం గురించి అన్ని గ్రామాలకు తెలియాలని కేసీఆర్‌ సూచించారు. ఈ నెల 26న దళితబంధుపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని.. పథకంలోని అన్ని అంశాలపై చర్చిస్తారని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని దళితులందరికీ వందకు వంద శాతం న్యాయం చేస్తామని రామస్వామికి హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.

Read More : Zomato: ‘జొమాటో’ పుట్టుక వెనుక కారణం ఏంటో తెలుసా?

తెలంగాణ దళితజాతి భవిష్యత్ ఈ పథకంపై ఆధారపడి ఉంటుందని, చాలా బాధ్యతతో, ఓపికతో చేసే పనిగా అభివర్ణించారు సీఎం కేసీఆర్. జిల్లా కలెక్టర్ ఫోన్ చేస్తారని, ఆదివారం అక్కడనే లంచ్ చేస్తారని రామస్వామికి వివరించారు. 26వ తేదీన జరిగే కార్యక్రమం గురించి మాట్లాడుకుంటారన్నారు. 26వ తేదీ ఉదయం మండల కేంద్రానికి అందరూ వస్తారని, అక్కడనే బ్రేక్ ఫాస్ట్ కూడా ఉంటుందన్నారు.

Read More : Manipur iron womens : వెయిట్​లిఫ్టింగ్​ లో​ మణిపూర్ ఉక్కు మహిళలు

అందరూ బస్సులో ఎక్కి హుజూరాబాద్ కు చేరుకుని అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం హైదరాబాద్ కు రావాల్సి ఉంటుందన్నారు. అనంతరం తన ఆధ్వర్యంలో దళితబంధు పథకంపై చర్చ కొనసాగుతుందన్నారు. పథకంపై ఉన్న అనుమానాలు, ఇతరత్రా వివరాలు చర్చించుకోవడం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల్లో దళితబంధు కార్యక్రమం…గురించి అవగాహన తెలియచేయడం జరుగుతుందన్నారు సీఎం కేసీఆర్. దళిత జాతికి న్యాయం జరుగుతుందని సంపూర్ణమైన భరోసా ఉందని రామస్వామి చెప్పారు.