Vasalamarri Village: దత్తత గ్రామానికి కేసీఆర్.. సర్పంచ్‌కు సీఎం ఫోన్!
తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన తుర్కపల్లి మండలం వాసాలమర్రికి జూన్ 22వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు.

Kcr
CM KCR: తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన తుర్కపల్లి మండలం వాసాలమర్రికి జూన్ 22వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. పల్లె ప్రగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల పర్యటనలో భాగంగా సీఎం వాసలమర్రికి రాబోతున్నారు. ఈమేరకు స్థానిక అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది.
ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ పమేలా సత్పతి. వాసాలమర్రి గ్రామం సర్పంచ్ అంజయ్యకి ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్. ఊరంతా సామూహిక భోజనం చేద్దామని సర్పంచ్‌కి సూచించారు కేసీఆర్. అనంతరం గ్రామ సభ ఏర్పాటు చేసుకొని.. గ్రామ సమస్యలపై చర్చిద్దామని సర్పంచ్‌తో సీఎం చెప్పారు.
సామూహిక భోజన ప్రదేశం, గ్రామసభ నిర్వహణకు పెద్ద ఖాళీ స్థలాన్ని చూడాలని సర్పంచ్ అంజయ్యకు సూచించారు కేసీఆర్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.