CM KCR : బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఅర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈరోజు బాల్కసుమన్ ను పరామర్శించారు. బాల్కసుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Cm Kcr Visits Balka Suman Residence At Metpally
CM KCR : ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈరోజు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ ను పరామర్శించారు. బాల్కసుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ మధ్యాహ్నం మెట్‌పల్లి మండలం రేగుంట చేరుకున్నారు. సురేష్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కేసీఆర్ బాల్కసుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ ఇటీవల అనారోగ్యతో కన్నుమూశారు. సురేశ్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత పార్టీకి, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రైతులకు సేవలందించారు.