yadagiri gutta: రేపు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్ దంపతులు

yadagiri gutta: రేపు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్ దంపతులు

Yadadri

Updated On : April 24, 2022 / 7:54 PM IST

yadagiri gutta: తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సోమవారం రానున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. కొత్తగా నిర్మించిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అనుబంధ శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ముగియనున్న పంచకుండాత్మక మహా కుంభాభిషేకంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.

 

అనంతరం మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా హాజరవుతారు.