CM KCR : మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. నేడు భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్

కేసీఆర్ సర్కార్ ఒక్కో ఆస్పత్రిని 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. అల్వాల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని 28.41 ఎకరాల్లో జీ ప్లస్‌ 5 భవనాన్ని 897 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.

CM KCR : మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. నేడు భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్

Hyderabad

Updated On : April 26, 2022 / 8:33 AM IST

CM KCR Hyderabad : హైదరాబాద్‌లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఇవాళ సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ తరహాలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరుతో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించనుంది. ఇప్పటికే మూడు ఆస్పత్రుల నిర్మాణం కోసం 2 వేల 679 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

కేసీఆర్ సర్కార్ ఒక్కో ఆస్పత్రిని 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. అల్వాల్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని 28.41 ఎకరాల్లో జీ ప్లస్‌ 5 భవనాన్ని 897 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఎల్బీనగర్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని 21.36 ఎకరాల్లో 13.71 లక్షల చదరపు అడుగుల్లో జీ ప్లస్ 14 భవనాన్ని 900 కోట్లతో నిర్మించనున్నారు.

Telangana : ఆరోగ్య తెలంగాణ, రాజధాని చుట్టూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్

సనత్ నగర్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని 17 ఎకరాల్లో 13.71 లక్షల చదరపు అడుగుల్ల జీ ప్లస్ 14 భవనాన్ని 882 కోట్లతో కట్టనున్నారు. ప్రతీ ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేస్తారు. వీటికి అనుబంధంగా నర్సింగ్, పారా మెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ ఆస్పత్రులే పెద్దదిక్కుగా మారాయి. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రోగుల తాకిడి పెరగడంతో ఈ మూడు ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ భారం తగ్గించేందుకు ప్రభుత్వం మూడు కొత్త సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది.