Yadadri : సీఎం కేసీఆర్ రేపటి యాదాద్రి పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్ రేపటి యాదాద్రి పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17న చిన్నజీయర్ స్వామితో కలిసి యాదాద్రికి వెళ్లాలని నిర్ణయించారు. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.

Yadadri : సీఎం కేసీఆర్ రేపటి యాదాద్రి పర్యటన వాయిదా

Kcr (1)

Updated On : September 13, 2021 / 2:10 PM IST

CM KCR Yadadri tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేపటి యాదాద్రి పర్యటన వాయిదా పడింది..! ఈ నెల 17న చిన్నజీయర్ స్వామితో కలిసి యాదాద్రికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. చిన్న జీయర్ స్వామితో కలిసి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి… పునఃప్రారంభ ముహూర్తంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఈ నెల ఒకటిన ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు. దీనికి ప్రధాని సుముఖత వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం ఆలయ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో ముఖ్య కార్యద‌ర్శి భూపాల్ రెడ్డి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

Yadadri Temple : యాదాద్రి…పుష్కరిణి సిద్ధం, ట్రయల్ రన్

ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగు పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిప్టు, రథశాలకు మరిన్ని మెరుగులు దిద్దాలని సూచించారు.