Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా రూ.12,000 ఇచ్చేది అప్పుడే.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ప్రకటన
భూమిలేని నిరుపేదల గురించి కూడా ఆలోచించామని వారికి కూడా ఇస్తామని చెప్పారు.

CM Revanth Reddy
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా రూ.12,000 ఇచ్చేది ఎప్పుడో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు.
“తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తొలి 10 నెలల్లో 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ మొదటి పది నెలలలో ఇంత రుణమాఫీ చేయలేదు. మేము రైతులను రుణ విముక్తులను చేశాం.
రైతులకు స్వేచ్ఛను ఇచ్చాం. రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ పని చేశాం. గతంలో రైతు బంధు ఎన్నికల సమయంలోనే ఇచ్చేవారు. గతంలో ప్రభుత్వ భూములను అమ్మేశారు. అయినప్పటికీ ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకుని రైతు బంధు వేయలేదు.
Also Read: ఈ ఒకే ఒక్క యాప్‌లో ఎన్నెన్ని సర్వీసులో.. ప్రతిరోజు మనకు అవసరమయ్యేవే..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు భరోసా కింద 7,625 కోట్ల రూపాయలను కేటాయించాం. ఆ ప్రభుత్వం ఎగవేసిన డబ్బులను మన ప్రభుత్వం ఇవాళ ఇస్తోంది. తొలి మూడు నెలల్లోనే వేశాం. అప్పట్లో రూ.10 వేలే ఇచ్చేవారు. ఇప్పుడు రూ.12 వేలు ఇస్తున్నాం.
మార్చి 31లోగా మొత్తం డబ్బును వేయాలని భావిస్తున్నాం. అంతేకాదు, గ్రామాల్లో దళితులు, గిరిజనులు బలహీన వర్గాలకు భూములు లేవు. దీంతో వారికి ప్రభుత్వం భరోసా పథకం ఇవ్వలేకపోతోంది. భూమిలేని నిరుపేదల గురించి కూడా ఆలోచించాం.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12 వేల చొప్పున ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఉపాధి హామీ కూలీ కార్డు ఉన్న కుటుంబానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.