Telangana Govt: గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో మారుబెనీ కంపెనీ రూ. వెయ్యి కోట్లు పెట్టుబడులు.. 30వేల మందికి ఉద్యోగావకాశాలు

టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.

Telangana Govt: గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో మారుబెనీ కంపెనీ రూ. వెయ్యి కోట్లు పెట్టుబడులు.. 30వేల మందికి ఉద్యోగావకాశాలు

CM Revanth Reddy

Updated On : April 18, 2025 / 9:29 AM IST

Telangana Govt: తెంలగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా పెద్దమొత్తంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం.. త్వరలో ప్రకటన..?

టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇండస్ట్రీయల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో దశల వారీగా ఆరు వందల ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రీయల్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.

Also Read: Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం స్కీంకు భారీగా దరఖాస్తులు.. అత్యధికంగా ఆ కేటగిరీకే.. అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే?

మారుబెనీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 65దేశాల్లో 410కిపైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా నెక్స్ట్ జనరేషన్ ఇండ స్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే చాన్స్ ఉంది. మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధా నంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది. అయితే, అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు తగ్గట్టు ఈ ప్రాజెక్టు చేపడతారని అధికార వర్గాలు తెలిపాయి.

 

చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి ఇండస్ట్రీయల్ పార్క్ ఇదే. దీంతో దాదాపు 30వేల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మారుబెనీకి ప్రభుత్వం తరపున తగినంత మద్దతు ఉంటుందని, దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ప్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని అందులో ఈ సంస్థ సెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు.