Future City: ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ.. ఎఫ్‌సీడీఏ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ప్యూచర్ సిటీ డవలప్ మెంట్ అథారిటీ (FCDA) భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Future City: ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ.. ఎఫ్‌సీడీఏ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Future City

Updated On : September 28, 2025 / 1:03 PM IST

Future City: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో ప్యూచర్ సిటీ డవలప్ మెంట్ అథారిటీ (ఎఫ్సీఐడీ) కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీరాఖాన్ పెట్ లో FCDA భవనానికి సీఎం భూమిపూజ చేశారు. ఫ్యూచర్ సిటీలోని మీర్​ఖాన్​పేటలో 7,29 ఎకరాల స్థలంలో ఎఫ్​సీడీఏ భవనంను నిర్మించనున్నారు. అదేవిధంగా రావిర్యాల నుండి అమన్‌గల్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలు, 56 రెవిన్యూ గ్రామాల పరిధిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీనిర్మాణం కానుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీ ని నిర్మాణం చేయనున్నారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా ఫ్యూసిటీ ఏర్పాటు కానుంది.

దేశంలో మొదట్టమొదటి నెట్-జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు చేయనున్నారు. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్-బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్ ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీ ఏర్పాటు కానుంది.

ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న ఎఫ్సీడీఏ భవనం 15వేల చదరపు అడుగుల్లో రూ.20 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నాలుగు నెలల్లో ఈ నిర్మాణం పూర్తికానుంది. అనంతరం ప్యూచర్ సిటీలో జరిగే అభివృద్ధి పనులు, లేఅవుట్లు, పరిశ్రమలకు FCDA అధికారులు అనుమతులు ఇవ్వనున్నారు.