CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ..

రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులకి కూడా సహకారం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి విన్నవించినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ..

Updated On : May 24, 2025 / 9:20 PM IST

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో సీఎం రేవంత్ చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలకు సంబంధించి ప్రధానిని కలిసి మాట్లాడారు. వాటికి ఆమోదించాలని సీఎం రేవంత్ కోరారు. RRR కు అవసరమైన ఆర్థిక సాయం చేయాలంటూ కూడా ప్రధాని మోదీని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

Also Read: కవిత లేఖ, కామెంట్స్ పై కేటీఆర్ రియాక్షన్.. ఏదైనా చెప్పాలనుకుంటే..

బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకి మంజూరు చేయాలని కూడా విన్నవించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సెమీ కండక్టర్ రంగానికి మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఐఎస్ఎం ప్రాజెక్ట్ కి కూడా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులకి కూడా సహకారం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి విన్నవించినట్లు తెలుస్తోంది.