గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తూ.. మరింత అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్

చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ 30ఏళ్లుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు.. గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తూ..

గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తూ.. మరింత అభివృద్ధి చేస్తాం : సీఎం రేవంత్

CM Revanth Reddy

CM Revnath Reddy: హైదరాబాద్ నగరం ఇండియాలోని ఐదు మెట్రోపాలిటన్ నగరాల్లో ఒక ప్రముఖమైన నగరం.. మిగతా మెట్రోపాలిటన్ నగరాలతో కాదు.. ప్రపంచంతోనే పోటీపడే స్థాయికి హైదరాబాద్ నగరం ఎదిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయంను రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ 30ఏళ్లుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని, గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తూ.. మరింత అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పారు. నగర శివారు ప్రాంతాలకు త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు వస్తుందని, రింగు రోడ్డు చుట్టూ మెట్రో రైలు సదుపాయం కూడా కల్పిస్తామని రేవంత్ అన్నారు. హైదరాబాద్ తో పాటు మొత్తం తెలంగాణ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : Medaram Jatara 2024 : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..