సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

సబిత ఇంత ఆవేదన చెందితే మరి కేసీఆర్, హరీశ్ రావు ఎందుకు..

సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

CM Revanth Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇవాళ అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. సభలో సబితమ్మ, సునీతా లక్ష్మారెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి సమాధానం చెప్పారని అన్నారు. 2018లో నర్సాపూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే తనపై రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ఇప్పటికీ కోర్టులకు తిరుగుతున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో తాము పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామని చెప్పారు. సబిత ఇంత ఆవేదన చెందితే మరి కేసీఆర్, హరీశ్ రావు ఎందుకు రాలేదని నిలదీశారు. సభకు వచ్చి మాట్లాడాలి కదా అని అన్నారు. కేసీఆర్‌కు బాధ్యత లేదని చెప్పారు. ప్రజలు అంటే ప్రేమ లేదని అన్నారు.

అధికారం లేకపోతే సభకు రానని అంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. సభలో తమ కంటే వాళ్లే ఎక్కువ మాట్లాడారని చెప్పారు. సభ ప్రజాస్వామ్యంగా నడుస్తోందని, చర్చలకు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. జగదీశ్వర్ రెడ్డి , కేటీఆర్, హరీశ్ సభలో తమకంటే ఎక్కువ సమయం మాట్లాడారని చెప్పారు. అతి చేస్తే శాసన సభ్యుల సభ్యత్వాన్ని కూడా స్పీకర్ రద్దు చేసేయొచ్చని అన్నారు.

Also Read: తమ కర్మకాలి అసెంబ్లీకి వచ్చామంటూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి