CM Revanth Reddy: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్.. ఆ విషయంలో కొంత వెనకబడ్డామంటూ వ్యాఖ్య

మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కె. కేశవరావు పార్టీలో చర్చిస్తారు. ‘కగార్’ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక, ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని రేవంత్ చెప్పారు.

CM Revanth Reddy: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్.. ఆ విషయంలో కొంత వెనకబడ్డామంటూ వ్యాఖ్య

Telangana CM Revanth Reddy

Updated On : April 28, 2025 / 1:34 PM IST

Revanth Reddy: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ మాట్లాడారు.

 

ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే. కేసీఆర్, మోదీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని రేవంత్ అన్నారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇందుకోసం ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలో అమల్లో లేవు. చివరి ఆరు నెలలుగా వీటిపై చర్చ జరుగుతుందని అన్నారు.

 

కేసీఆర్ తన అక్కసు మొత్తం వెల్లగక్కాడు. పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నాడు.. మరి వాళ్లనెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడు..? ఆయన రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలు వేస్తున్నారు. బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కేసీఆర్‌ అభద్రతాభావంతో మాట్లాడారు.. ఆయన స్పీచ్ లో పసలేదని రేవంత్ అన్నారు. సంవత్సరంన్నరగా పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటన్నింటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని అడిగారు. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వమన్నాం. ఆర్టీసీకి ఆదాయం వస్తుంటే వద్దంటామా..? నేను ఇంకా ఇరవైయేళ్లు రాజకీయాల్లో ఉంటాను. నేను చట్టంప్రకారమే నడుచుకుంటా. అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని అరెస్టు చేయలేను. నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను.. ఇప్పించానని రేవంత్ అన్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన పనులను, అమలు చేస్తున్న పథకాలను చెప్పుకోవటంలో కొంత వెనకపడ్డాం. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. కొందరు అధికారుల తీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో మీడియా ప్రశ్నించగా.. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం. ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేది ఎలా అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.

 

మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. మావోయిస్టుల అంశంపై జానారెడ్డి, కె. కేశవరావు పార్టీలో చర్చిస్తారని అన్నారు కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి.. కగార్ పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక, ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని రేవంత్ చెప్పారు.