Cold Waves : విపరీతమైన చలితో వణికిపోతున్నారా.. అయితే, మీకు భారీ ఊరట.. జనవరి 1 నుంచి కోల్డ్‌వేవ్‌కు బైబై..

Cold Waves : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో..

Cold Waves : విపరీతమైన చలితో వణికిపోతున్నారా.. అయితే, మీకు భారీ ఊరట.. జనవరి 1 నుంచి కోల్డ్‌వేవ్‌కు బైబై..

Cold Waves

Updated On : December 28, 2025 / 7:47 AM IST

Cold Waves : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను చలి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే పలు పనులకు, కార్యాలయాలకు వెళ్లేవారు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పలు అనారోగ్యాల పాలవుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ భారీ ఊరట కలిగించే వార్త చెప్పింది.

Also Read : Gold Silver Price : బంగారం, వెండి ధరలు పైపైకి.. అసలు కారణం ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..

నెల రోజులుగా గ్యాప్ లేకుండా చలిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 9గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు పలు అనారోగ్యాల భారిన పడుతున్నారు. అయితే, ఈ నెలాఖరుతో ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. డిసెంబర్ నెల చివరికి కోల్డ్‌వేవ్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటిదాకా గజగజ వణికించిన చలి ఇక తగ్గుముఖం పట్టనున్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో మరో మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠంగా 3డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే, జనవరి 1వ తేదీ నుంచి చలి తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

జనవరి 1వ తేదీ నుంచి రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కోల్డ్‌వేవ్ ముగిసినా.. చలి మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. జనవరి తొలివారం చివరిలో లేదంటే రెండో వారంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ వీక్లీ బులెటిన్లో వెల్లడించింది.

అయితే, డిసెంబర్ చివరి వరకు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, గ్లౌజులు ధరించాలని, ఎల్లప్పుడూ వేడిగా ఉండే ఆహారం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.