Maganti Sunitha: మాగంటి సునీతపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణ
మాగంటి సునీత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ రాజకీయం హీట్ ఎక్కింది. అధికార, విపక్షం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మాటల యుద్ధం ఫిర్యాదుల వరకు వెళ్లింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఓవైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు మాగంటి సునీత ప్రెస్ మీట పెట్టడం ఏంటని మండిపడ్డారు.
ఎన్నికలు జరుగుతుండగా ప్రెస్ మీట్ నిర్వహించడం ఈసీ నిబంధనలకు విరుద్ధం అని కాంగ్రెస్ నేతలు అన్నారు. దీనిపై వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాగంటి సునీత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.
కాగా, మీడియాతో మాట్లాడిన మాగంటి సునీత కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఆరోపణలు చేశారు. నీ అంతు చూస్తాం అంటూ తనను బెదిరించారని అన్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అతడి సోదరుడు, అనుచరులు రౌడీయిజం చేశారని అన్నారు. 14వ తేదీ తర్వాత ఒక్కొక్కరి సంగతి చూస్తానని ఆమె హెచ్చరించారు.
Also Read: మాగంటి సునీతపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణ
