Congress Focus On Munugode By Poll : లక్షమంది కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్.. మునుగోడులో హస్తం పార్టీ సెంటిమెంట్ అస్త్రం

ఇన్నాళ్లు పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడేవారు. నియోజకవర్గంలో తిరుగుతూ విన్యాసాలు చేసేవారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు.. ఓ పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇంకా అభ్యర్థినే ప్రకటించలేదు కానీ, ఏకంగా కాళ్లు మొక్కేందుకు సిద్ధమవుతుండటం పొలిటికల్ గా ఆసక్తి పెంచుతోంది.

Congress Focus On Munugode By Poll : లక్షమంది కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్.. మునుగోడులో హస్తం పార్టీ సెంటిమెంట్ అస్త్రం

Updated On : August 19, 2022 / 6:52 PM IST

Congress Focus On Munugode By Poll : ఇన్నాళ్లు పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడేవారు. నియోజకవర్గంలో తిరుగుతూ విన్యాసాలు చేసేవారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు.. ఓ పార్టీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇంకా అభ్యర్థినే ప్రకటించలేదు కానీ, ఏకంగా కాళ్లు మొక్కేందుకు సిద్ధమవుతుండటం పొలిటికల్ గా ఆసక్తి పెంచుతోంది.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు గ్రౌండ్ లోకి దిగారు. నియోజకవర్గంలో 176 గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించనుంది కాంగ్రెస్. అలాగే అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేయనున్నారు. ప్రతి ఇంటికి పండ్ల, బుట్ట పంపిణీ చేయనున్నారు. మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు, కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. పాదయాత్రతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ప్రచారంలోకి దిగనున్నారు. నారాయణ పూర్ మండలం పొర్లగడ్డ తాండాలో రేవంత్ రెడ్డి టూర్ ప్రారంభం అవుతుంది. మునుగోడులో వంద రోజుల ప్రచార ప్రణాళికతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ప్రచారంలో వినూత్న తరహాని హస్తం పార్టీ అవలంభించనుంది. నియోజకవర్గంలో లక్ష మందికి కాళ్లు మొక్కి ఓటు అడిగేలా ప్రణాళికలు చేసింది.

సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ మునుగోడులో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే యోచనలో ఉంది. కాళ్లు మొక్కుతా.. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని అడగబోతున్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో లక్ష మందికి కాళ్లు మొక్కి ఓటు అడిగేలా ప్రణాళిక రచిస్తోంది. ప్రతీ గ్రామానికి ఐదుగురు చొప్పున ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటర్ కాళ్లు మొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మునుగోడులో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.