CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మ‌న్‌గా రేవంత్ రెడ్డి.. కమిటీలో 25 మందికి చోటు

  లోక్ సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ క్షలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా ...

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మ‌న్‌గా రేవంత్ రెడ్డి.. కమిటీలో 25 మందికి చోటు

CM Revanth Reddy

Updated On : January 7, 2024 / 11:40 AM IST

Telangana Congress Party :  లోక్ సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని అదిష్టానం నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డితో కలిపి మొత్తం 25 మంది ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ముగ్గురికి అవకాశం కల్పించారు. వారిలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు స్థానం కల్పించారు.

Also Read : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు

కమిటీ సభ్యులు వీరే..
రేవంత్ రెడ్డి (చైర్మన్), మల్లు భట్టి విక్రమార్క, తాటిపర్తి జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కందూరు జానారెడ్డి, వి. హన్మంతరావు, చల్లా వంశీచందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ, వై. మదుయాష్కి గౌడ్, సంపత్ కుమార్, రేణుకాచౌదరి, పోరిక బలరాంనాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, ఎం. అంజన్ కుమార్ యాదవ్, బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, మహ్మద్ అలీ షబ్బీర్, ప్రేమ్ సాగర్ రావు, పోడెం వీరయ్య, ఎం. సునీతరావు ముదిరాజ్.