Komatireddy Venkat Reddy : త్వరలో 70 సీట్ల ప్రకటన, ఆ తర్వాత రాజకీయాలకు దూరం- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy : వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగానే పోటీ చేస్తానన్న కోమటిరెడ్డి.. నెక్ట్స్ టర్మ్ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు.

Komatireddy Venkat Reddy : త్వరలో 70 సీట్ల ప్రకటన, ఆ తర్వాత రాజకీయాలకు దూరం- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy

Updated On : June 27, 2023 / 11:12 PM IST

Komatireddy Venkat Reddy – Congress : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు జూలైలో 70 కాంగ్రెస్ సీట్ల ప్రకటన ఉంటుందన్నారు. కాంట్రవర్సీ ఉన్న స్థానాలు మినహా అన్నింటిని అధిష్టానం ప్రకటిస్తుందని వెల్లడించారు. సర్వేల ఆధారంగానే సీట్లు ఉంటాయన్నారు కోమటిరెడ్డి. వచ్చే ఎన్నికల్లోనూ తాను ఎంపీగానే పోటీ చేస్తానన్న కోమటిరెడ్డి.. నెక్ట్స్ టర్మ్ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యాఖ్యానించారు.

”కాంగ్రెస్ కు దూరమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పారు. సర్వేల ఆధారంగానే సీట్లు. ఈ వారం ఎలక్షన్ కమిటీ, వచ్చే నెలలో చాలా టికెట్ల ప్రకటన ఉంటుంది. అంతర్గత, బహిరంగ విషయాలు అన్నీ మాట్లాడాము. నాలుగు నెలలే గడువు ఉంది. యాక్షన్ ప్లాన్ సిద్ధం. రాజగోపాల్ గురించి నాకు తెలియదు. 2గంటల 40నిమిషాల పాటు మీటింగ్ జరిగింది. ఎలాంటి పొత్తు ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తా. నెక్స్ట్ టర్మ్ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటా. అందరు వేరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేరు. స్కీమ్ లే కాదు, స్కామ్స్ కూడా బయటపెట్టాలి.

Also Read..Eatala Jamuna : ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు : ఈటల సతీమణి జమున

హద్దుమీరిన వాళ్లపై చర్యలకి వెనుకాడబోమని రాహుల్ గాంధీ చెప్పారు. నేను ప్రజల లీడర్ ని. ప్రజల వెనుకే నేను. కొల్హాపూర్ కు కేసీఆర్ కార్లలో పోవడం గొప్ప కాదు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు, మంత్రులు పోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నల్గొండ ఎమ్మెల్యేలు, మంత్రులు మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేసినా నాలుగు ఓట్లు కూడా రావు.

మేనిఫెస్టో, టికెట్లు మీరే నిర్ణయించండి, మేము అప్రూవ్ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందించాలని రాహుల్ సూచించారు. అమలు చేయదగ్గ హామీలే ఇవ్వాలని ఖర్గే అన్నారు. గతంతో పోల్చితే ఇవాళ్టి మీటింగ్ చాలా మంచిగా జరిగింది. కాంట్రవర్సీ ఉన్నవి తప్ప మిగిలిన సీట్ల ప్రకటన జూలైలో ఉంటుంది. 70 సీట్ల ప్రకటన ఉంటుంది. ఢిల్లీకి వచ్చే రష్ తగ్గుతుంది. ఎవరితోనూ పొత్తు ఉండదు” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Also Read..Andole Constituency: ఆందోల్ కోటలో పాగా వేసేదెవరు.. ప్రధాన పార్టీల్లో పెరిగిపోతున్నఆశావాహులు!