Jagga Reddy : పార్టీని బలోపేతం చేసే ఆయుధం, మందు నాదగ్గర ఉంది….కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
టీ.పీసీసీ అధ్యక్ష రేసులో నేనూ ఉన్నానని.. పార్టీని బలోపేతం చేసే ఆయుధం, మందు నా దగ్గర ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Jagga Reddy
Jagga Reddy : టీ.పీసీసీ అధ్యక్ష రేసులో నేనూ ఉన్నానని.. పార్టీని బలోపేతం చేసే ఆయుధం, మందు నా దగ్గర ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నాకు పీపీసీ పదవి కావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్‌ను కోరానని ఆయన చెప్పారు. కోవిడ్ రోగులకు సేవలందించేందుకు ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్ గాంధీభన్ లో ఉచిత అంబులెన్స్ సేవలను ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్ నుంచి తెలంగాణ లోఎక్కడికైనా ఉచిత అంబులెన్స్ సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. సంగారెడ్డి నియోజక వర్గ ప్రజల కోసం ఆరు అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నాయని, స్ధానిక ప్రజలు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి రావటానికి అంబులెన్స్ లు అందుబాటులో ఉంచామని చెప్పారు.
ప్రస్తుత కరోనా సమయంలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చర్చ అవసరం లేదని…. అదంతా మీడియా సృష్టే అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ జగ్గారెడ్డి……మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ లోకి రాకపోవడానికి కారణం… కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో లేకపోవటమే కారణని చెప్పారు. ఈటలకు ఇప్పుడున్న పరిస్థితిలో స్టేట్ పోలీస్ నుంచి రక్షించుకోవడం కోసం సెంట్రల్ పోలీస్ వద్దకు వెళ్ళారని వ్యాఖ్యానించారు. ఈటల బలహీనుడు కాబట్టే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కి వెళ్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.
టీ.పీసీసీ అధ్యక్షుడు ఎంపిక నిజంగా జరిగితే అందరి సమన్వయం తోనే జరగాలని…కాంగ్రెస్ వరుస ఓటములకు నాయకత్వ సమస్య ప్రధానం కాదని….పీసీసీ అధ్యక్షుడుగా అధిష్టానం ఎవర్ని నియమించినా ..పార్టీ కోసం యధావిధిగా పని చేస్తానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఇష్టమైన వ్యక్తి వస్తే.. బాగా కష్టపడుతా.. లేదంటే సైలెంట్ గా ఉంటాఅని ఆయన తెలిపారు.