కేసీఆర్‌పై విజ‌య‌శాంతి సెటైర్లు!.. ఆ మూడు రాష్ట్రాల్లో వచ్చే సీట్లతో కేంద్రంలో కారు చక్రం తిప్పొచ్చట

బీఆర్ఎస్ ప్రస్తుతమున్న అతిపెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్ సభ ఎన్నికలుచాలా చిన్నవి. జాతీయ పార్టీని ప్రకటించుకున్న కేసీఆర్..

కేసీఆర్‌పై విజ‌య‌శాంతి సెటైర్లు!.. ఆ మూడు రాష్ట్రాల్లో వచ్చే సీట్లతో కేంద్రంలో కారు చక్రం తిప్పొచ్చట

Vijayashanti

Updated On : December 26, 2023 / 11:28 AM IST

Vijayashanthi: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి సెంటైర్లు పేల్చారు. ట్విటర్ (ఎక్స్) వేదికగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పొరుగు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ విజయశాంతి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నిర్దేశించుకున్న పెద్ద కార్యాచరణ ముందు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు చిన్నవని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పొరుగు రాష్ట్రాల్లో 50 స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పొచ్చంటూ విజయశాంతి ఎద్దేవా చేశారు.

Also Read : YS Sharmila : లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్‌ కానుక వెనుక లాజిక్‌ ఏంటి? ఏపీలో రాజకీయ తుఫాన్‌కు ముందస్తు హెచ్చరికలా!

విజయశాంతి ట్వీట్ ప్రకారం.. బీఆర్ఎస్ ప్రస్తుతమున్న అతిపెద్ద కార్యాచరణ ముందు తెలంగాణ లోక్ సభ ఎన్నికలుచాలా చిన్నవి. జాతీయ పార్టీని ప్రకటించుకున్న కేసీఆర్.. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు వారి నాయకత్వం కోరుకుంటున్నారని గతంలో ఎన్నోమార్లు తెలంగాణ ప్రజల ముందు ప్రగల్భాలు ఘనంగా చెప్పుకున్న సంఘటనల దృష్ట్యా .. ఆయా రాష్ట్రాల్లో అత్యవసరంగా పనిచేసి “భవిష్యత్ రహిత సమితి” అని తెలంగాణ సమాజం నిర్ణయించిన బీఆర్ఎస్‌కు అనేక ఎంపీలు వారు గెలిపించి తీరుతారు బహుశా.. అంటూ ఎద్దేవా చేశారు.

Also Read : CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ

తెలంగాణలో సుమారు 14 పార్లమెంట్ స్థానాల్లో సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో నేతలు, కార్యకర్తల కృషితో కాంగ్రెస్ ను గెలిపించి, ఒక మూడు స్థానాలు ఎట్లనో ఒకవేళ బీఆర్ఎస్ వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 50 స్థానాలు గెలిచి కేసీఆర్ కేంద్రంలో కారు చక్రం తిప్పవచ్చు అంటూ మాజీ సీఎం కేసీఆర్ పై విజయశాంతి పంచ్ లు వేశారు.