Mallu Ravi Comments : కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి.. నిపుణుల నివేదికే ఫైనల్.. : మల్లు రవి కామెంట్స్

Mallu Ravi Comments : ప్రభుత్వం వచ్చి 80 రోజులే అవుతుందన్న ఆయన ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పులను సరిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Mallu Ravi Comments : కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి.. నిపుణుల నివేదికే ఫైనల్.. : మల్లు రవి కామెంట్స్

Congress Senior Leader Mallu Ravi Comments On BRS Party Over kaleshwaram project failure

Mallu Ravi Comments : బీఆర్ఎస్ చేసిన తప్పులన్ని ఒప్పుకుని కాళేశ్వరం విజిట్ చేయడం వెంటనే మానుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. అసలు కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్వేతపత్రంలో కాళేశ్వరంలో జరిగిన తప్పులను, వాస్తవాలను ప్రజల ముందు ఉంచామన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులను ప్రజల ముందు ఒప్పుకోని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు చెయ్యరని, నిపుణుల కమిటీ నివేదికే ఫైనల్ అన్నారు.

Read Also : Sharat Prathipati Arrest : మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు అరెస్ట్

కాళేశ్వరం తప్పులను సరిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధం :
కాళేశ్వరం విషయంలో జరిగింది చిన్నపోరపాటు కాదని కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పారు. కాళేశ్వరం కట్టి నష్టపరిస్తే.. పాలమూరు రంగారెడ్డిని కట్టకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. కోటి ఏకరాలకు నీళ్లు అంటూ బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, లక్ష ఏకరాలకు కూడా నీరు అందలేదని మండిపడ్డారు.

దొంగే దొంగ అని అరిచినట్లు బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు మీరు చేసిన అన్యాయాన్ని ఎవరు మర్చిపోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం వచ్చి 80 రోజులే అవుతుందన్న ఆయన ప్రాజెక్టు విషయంలో జరిగిన తప్పులను సరిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం :
నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మల్లి రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని, తప్పు చేసి తప్పును ఒప్పుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జరిగిన తప్పును కేసీఆర్ ఒప్పుకోవడం లేదని, తప్పు ఒప్పుకోకపోవడం అనేది కేసీఆర్ రాచరికనికి నిదర్శనమన్నారు.

కాళేశ్వరం వద్దకు ఎవరు వెళ్లినా జరిగిన తప్పులనే చూపించాల్సి ఉంటుందని చెప్పారు. నిపుణులైన ఇంజనీర్లు కాకుండా కేసీఆర్ డిజైన్ చెయ్యడంతోనే కాళేశ్వరం ప్రజలకు భారంగా మారిందని విమర్శించారు. కాళేశ్వరం డిజైన్ సరిగలేదని ఎల్ అండ్ టీ చెప్పినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం వినిపించుకోలేదని మల్లురవి గుర్తు చేశారు.

Read Also : Nagarkurnool MP Ramulu : బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. అందుకే బీజేపీలో చేరాను : నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు