కరోనా ఎఫెక్ట్, కల్లు దొరక్క వ్యక్తి మృతి, కొందరు పిచ్చోళ్లయ్యారు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 08:35 AM IST
కరోనా ఎఫెక్ట్, కల్లు దొరక్క వ్యక్తి మృతి, కొందరు పిచ్చోళ్లయ్యారు

Updated On : March 28, 2020 / 8:35 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 190కు పైగా దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యతో పాటు మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మన దేశంలోనూ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఓ రేంజ్ లో ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రజల సంక్షేమం కోసం లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. దీంతో రెస్టారెంట్లు, బార్లు, మద్యం, కల్లు షాపులు మూతపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టాలంటే ఈ చర్యలు తప్పవు.

లాక్ డౌన్ తో మందుబాబుల పరేషాన్:
ఇతరుల పరిస్థితి ఏమో కానీ, మందుబాబులు మాత్రం పరేషాన్ అవుతున్నారు. రోజూ చుక్క తాగే అలవాటు ఉన్నవారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపులు మూసేసిన సంగతి తెలిసిందే. మందు దొరక్క మద్యం ప్రియులు నరకయాతన అనుభవిస్తున్నారు. మరోవైపు కల్లు తాగే అలవాటు ఉన్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కల్లు షాపులు మూతపడ్డాయి. దీంతో కల్లు తాగే అలవాటు ఉన్న వారు విలవిలలాడిపోతున్నారు.

కల్లు దొర్కక వ్యక్తి మృతి:
నిజామాబాద్ లో కల్లు ప్రియులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్లు దొరక్కపోవడంతో వారికి పిచ్చెక్కింది. కాగా స్థానికంగా విషాదం చోటు చేసుకుంది. కల్లు దొరక్కపోవడంతో ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి చనిపోయాడు. కల్లు ప్రియులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారు.

మందు, కల్లు దొరక్క ప్రాణాలు పోతున్నాయి:
లాక్‌డౌన్‌తో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. మద్యం, కల్లు దుకాణాలు బంద్ కావడంతో తెగ ఇబ్బందిపడుతున్నారు. వైన్ షాపులు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో పడ్డారు మద్యం ప్రియులు. జనతా కర్ఫ్యూ రోజు నుంచి ఇదే పరిస్థితి. రోజూ సాయంత్రం మద్యం, కల్లు తాగే కొందరికి చుక్కలు కనపడుతున్నాయి. గ్రామాల్లో కల్లు తాగి మందుబాబులు కాస్త ఊరట చెందుతుంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం కష్టాలు తప్పడం లేదు. చెప్పుకుంటే సిగ్గు పోతుంది.. చెప్పకుంటే ప్రాణం పోతుంది అన్నట్లుగా పరిస్థితి ఉంది.

కొందరికి ఫిట్స్, మరికొందరికి పిచ్చి:
గ్రామాల్లో మద్యం షాపులు లేకపోయినా జనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. కల్లుతో మద్యం కష్టాలను అధిగమిస్తున్నారు. దీంతో కల్లుకు డిమాండ్ పెరిగింది. జనాలంతా పొలాలకు, తాటి చెట్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. గ్రామాల్లో ఉన్న వారి సంగతి పక్కన బెడితే నగరాల్లో, పట్టణాల్లో ఉన్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కల్లు దొరక్క ఇబ్బందిపడుతున్నారు. కల్లు తాగక కల్లు ప్రియుల ప్రాణాల మీదకు వస్తోంది. వాళ్లకు నిద్ర కూడా కరువైంది. ఈ ప్రభావం వారి ఆరోగ్యాలపై పడుతోంది.. కొంతమందికి ఫిట్స్ రావడం, పిచ్చి పిచ్చిగా, వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. వారి పరిస్థితి చూసి తట్టుకోలేక కొన్ని గ్రామాల్లో ఊరి సర్పంచ్‌లే కల్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కూడా కల్లుకు డిమాండ్ పెరగడంతో.. పెద్దగా దొరకడం లేదట. చిన్న, చిన్న పట్టణాలకు వచ్చే కల్లు కూడా ఆగిపోయిందదట.. దీంతో కల్లు ప్రియులు విలవిలలాడిపోతున్నారు.

Also Read | రామాయణం, మహాభారతం చూస్తున్నారా