లాక్ డౌన్..డోంట్ కేర్ అంటున్న ఓల్డ్ సిటీ వాసులు

కరోనా వ్యాపిస్తోంది..ఎక్కడకు వెళ్లకండి..దీనికి మందు లేదు..సోషల్ డిస్టెన్స్ పాటించడం బెటర్..వైరస్ వచ్చిన వారు..బయటకు వస్తే..ఎంతో మందికి సోకుతుంది..బతికి ఉంటే బలుసాకు తినొచ్చు..దండం

లాక్ డౌన్..డోంట్ కేర్ అంటున్న ఓల్డ్ సిటీ వాసులు

Updated On : January 20, 2022 / 5:24 PM IST

కరోనా వ్యాపిస్తోంది..ఎక్కడకు వెళ్లకండి..దీనికి మందు లేదు..సోషల్ డిస్టెన్స్ పాటించడం బెటర్..వైరస్ వచ్చిన వారు..బయటకు వస్తే..ఎంతో మందికి సోకుతుంది..బతికి ఉంటే బలుసాకు తినొచ్చు..దండం పెట్టి చెబుతున్నా..అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు..ప్రాణాలకు తెగించి..ఎంతో మంది విధులు నిర్వహిస్తున్నారు.

కానీ కొంతమంది నిబంధనలు పాటించడం లేదు. ఏం కాదు..అంటూ దర్జాగా రోడ్ల మీదకు వస్తున్నారు. ప్రధానంగా..పాతబస్తీలో లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అరే..కరోనా..నయే..కుచ్ బీ నహీ..చలో బాహార్ జాయింగే.. అంటూ పాతబస్తీకి చెందిన కొంతమంది రోడ్లమీదకు వస్తున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అస్సలు పాటించడం లేదు. గుంపులు..గుంపులుగా..తిరుగుతున్నారు. పోలీసులు వాహనాలు సీజ్ చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు.

ఓల్డ్ సిటీలో కరోనా కేసులు నమోదవుతున్నా..వారిలో ఎలాంటి భయం కలుగడం లేదు. 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చార్మినార్, సంతోష్ నగర్, ఫలక్ నుమా, చాంద్రాయణ గుట్ట, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 35 కంటైన్ మెంట్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు.

ఇందులో కొన్ని ప్రాంతాలను అష్టదిగ్భందనం చేశారు. కానీ కొంతమంది ఆకతాయిలతో అధికారులు చేస్తున్న కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది. అత్యవసర పనులు ఉంటేనే..బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 3 వేల వాహనాలను సీజ్ చేశారు.