హమ్మయ్య.. ఎవరికీ కరోనా లేదు, కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 01:59 AM IST
హమ్మయ్య.. ఎవరికీ కరోనా లేదు, కరీంనగర్‌లో 76వేల మందికి స్క్రీనింగ్

Updated On : March 21, 2020 / 1:59 AM IST

తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో

తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక ఇండోనేషియన్ల పుణ్యమా అని కరోనా వైరస్ కరీంనగర్ కు పాకింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన మత ప్రచారకుల బృందంలో 9మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన ఇండోనేషియన్లు కరీంనగర్ లో బస చేశారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. కరీంనగర్ నగరంలో కరోనా బాధితులను గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరీంనగర్ ను జల్లెడ పడుతున్నారు.

13వేల 428 ఇళ్లలో 50వేల 910 మందికి స్క్రీనింగ్‌:
కరీంనగర్‌లో మూడో రోజూ(శనివారం-మార్చి 21,2020) కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ ఉధృతంగా నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన ఇండోనేషియాకు చెందిన 8మంది మత ప్రచారకులు కరీంనగర్‌లో రెండురోజులు గడిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం(మార్చి 20,2020) 13వేల 428 ఇళ్లలో 76వేల 910 మందికి స్క్రీనింగ్‌ నిర్వహించారు. 23 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు. 34 మందికి స్వల్ప ఆరోగ్య సమస్యలు(జలుబు, దగ్గు) ఉండటంతో హోం క్వారంటైన్‌ చేసినట్టు మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుంచి ఇప్పటివరకు 374 మంది వివిధ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించామని, వీరి ఎడమ చేయిపై ప్రత్యేక స్టాంపు ముద్రించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 60 డివిజన్లలో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు.

See Also | కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ : మోడీకి సూచనలిచ్చిన కేసీఆర్

70మందిని కలిసిన కరోనా సోకిన ఇండోనేషియన్లు:
శనివారం(మార్చి 21,2020) సాయత్రంలోపు ఈ ప్రక్రియ పూర్తిచేసి ఇళ్లకు పరిమితం చేస్తామని మంత్రి చెప్పారు. మరోవైపు కార్పొరేషన్‌ పరిధిలో 950 మంది వివిధ డివిజన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు, వైద్య బృందాల సర్వే, స్క్రీనింగ్‌ను మంత్రి గంగుల కమలాకర్‌, కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి, మేయర్‌ సునీల్‌ రావు, నగర కమిషనర్‌ క్రాంతి పర్యవేక్షించారు. ఇప్పటివరకు ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించ లేదని అధికారులు చెప్పారు. ఇద్దరు అనుమానితులు ఉంటే వారిని హైదరాబాద్ పంపించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన కరోనా బాధితులను 70మంది కలిసినట్టు అధికారులు గుర్తించారు. శనివారం నుంచి ఇంటింటికీ వెళ్లి అనుమానితులను వైద్య బృందాలు గుర్తించనున్నాయి.

ఇండోనేషియా నుంచి వచ్చిన బృందంలో 9మందికి కరోనా:
ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా బృందంలో మొత్తం 9 మందిలో కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. కరీంనగర్‌ కేంద్రంతోపాటు ఈ బృందం పర్యటించిన ఇతర ప్రాంతాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. వారు నగరంలో ఉన్న మూడు రోజుల్లో ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్‌‌కు అతి సమీపంలోని ప్రార్థనా మందిరాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మార్చి 14, 15 తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచారించారని అధికారులు గుర్తించారు. ఇంకా వీరు తిరిగిన ప్రాంతాలను తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మార్చి 16న కరోనా పరీక్షల నిమిత్తం 12 మందిని వైద్య పరీక్షలకు హైదరాబాద్‌ తరలించగా.. మార్చి 18న మరో 9 మందిని తీసుకొచ్చారు. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా అధికారులు ఇండోనేషియా బృందంతో సన్నిహితంగా ఉన్నవారి కోసం గాలింపు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19కు చేరింది. 
కాగా, కరోనా అరికట్టే పనులకు ఆటంకం కలుగుతుందని సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.