Covid-19 New Cases : తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 2,524 పాజిటివ్

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 శాంపిల్స్ పరీక్షించగా 2,524 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది.

Covid-19 New Cases : తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 2,524 పాజిటివ్

Covid Cases Decreased In Telangana State 2524 New Cases

Updated On : May 31, 2021 / 11:53 PM IST

Telangana  Covid-19 New Cases : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 శాంపిల్స్ పరీక్షించగా 2,524 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. 18 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,78,351కి చేరింది.

మరో 18 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3281కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,084 యాక్టివ్ కేసులు ఉన్నాయని, నిన్న 3,464 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు.

ఇప్పటిదాకా 5,40,986 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 307 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 307 పాజిటివ్ కేసులు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక రంగారెడ్డి జిల్లాలో 142, ఖ‌మ్మం జిల్లాలో 134, నల్గొండ జిల్లాలో 183 కేసులు న‌మోదు అయ్యాయి. కరోనా కట్టడిలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 24,897 మందికి వ్యాక్సినేషన్ అందించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 31 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరిగింది.